న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. ఇటీవల డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అక్కడ కూడా విశేషం గా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం ను చూసిన నటి మంచు లక్ష్మీ సోషల్ మీడియా వేదిక గా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడే శ్యామ్ సింగరాయ్ చిత్రం చూడటం పూర్తి అయ్యింది, ఎక్కడి నుండి మొదలు పెట్టాలి, నేను పెద్ద నిస్సహాయ రొమాంటిక్ నీ ఈ చిత్రం ప్రతి సెల్ ను అందించడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి షాట్, కెమెరా పనితనం, డైలాగ్స్ అన్ని చాలా బాగా నచ్చాయి. సాయి పల్లవి నుండి దృష్టిని మరల్చ లేకపోయాను. నాని, మీ సినిమాల ద్వారా శాశ్వతమైన ప్రేమ పై నమ్మకం కలిగించినందుకు ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన చిత్రానికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. మంచు లక్ష్మీ చేసిన వ్యాఖ్యల పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
Just completed watching #ShyamSinghaRoy
Aaghh, where do I start about this film!
I am a big hopeless romantic and this film fed every cell for me. Loved each and every shot, the camera work, the dialogues everything about this film was top notch.— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2022