బాలయ్య – అనిల్ రావిపూడి సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ ?

బాలయ్య – అనిల్ రావిపూడి సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ ?

Published on Oct 30, 2022 10:23 PM IST


నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమా అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకి ‘రామారావు గారు’ అని టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నిజంగా ఈ టైటిల్ బాలయ్య సినిమాకి పెడితే అదిరిపోతోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నారు.

ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారట. అయితే బాలకృష్ణ కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తుండగా, భార్యగా ప్రియమణి కనిపించనుందని సమాచారం. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి. అందుకే, అనిల్ – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు