“మహేష్ 28” రీస్టార్ట్ కి ఆల్ సెట్..!

“మహేష్ 28” రీస్టార్ట్ కి ఆల్ సెట్..!

Published on Nov 11, 2022 12:32 AM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాని మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలు అయితే నెలకొల్పుకున్నా ఈ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఓ కీలక యాక్షన్ షెడ్యూల్ ని అయితే పూర్తి చేసుకుంది.

అయితే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసే లోపే పలు కారణాలతో వాయిదా పడడం మరింత ఆలస్యంగా మారింది. ఇక ఇప్పుడు అయితే అంతా సెట్టయ్యినట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ ని అయితే మేకర్స్ ఈ డిసెంబర్ మొదటి వారం నుంచి స్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేశారట.

ఇప్పుడు ఈ షెడ్యూల్ కి పనులు కూడా జరుగుతుండగా అప్పుడు అయితే ఎలాంటి విరామం లేకుండా సినిమా షూటింగ్ జరగనున్నట్టు టాక్. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు