లేటెస్ట్..నిఖిల్ “18 పేజెస్” కి స్టార్ హీరోతో సాంగ్.!

లేటెస్ట్..నిఖిల్ “18 పేజెస్” కి స్టార్ హీరోతో సాంగ్.!

Published on Nov 26, 2022 11:00 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “18 పేజెస్”. మరి ఈ చిత్రంపై ఇప్పుడు మంచి బజ్ నెలకొనగా మేకర్స్ ఆల్రెడీ మంచి ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారు. ఇక ఇదిలా ఉండగా ఆల్రెడీ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఆకట్టుకోగా ఇప్పుడు రెండో సాంగ్ పై లేటెస్ట్ సమాచారం బయటకి వచ్చింది.

మరి ఈ చిత్రంలో అయితే నెక్స్ట్ రిలీజ్ చేయబోయే సాంగ్ తమిళ స్టార్ నటుడు శింబు అయితే ఆలపించినట్టుగా తెలుస్తుంది. మరి శింబు అయితే “టైం ఇవ్వు పిల్ల టైం ఇవ్వు” అనే సాంగ్ ని పాడినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ కూడా అతి త్వరలోనే రానుంది. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మాణం వహించగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు