ప్రభాస్ కెరీర్ లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ అట !

ప్రభాస్ కెరీర్ లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ అట !

Published on Dec 12, 2022 6:14 PM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ క్రేజ్ ప్రాజెక్ట్స్ లో ‘సలార్’ కూడా ఒకటి. అయితే, సలార్ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. సలార్ సినిమాలో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఓ భారీ ఫైట్ అద్భుతంగా ఉంటుందట. ప్రభాస్ కెరీర్ లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ లా ఈ ఫైట్ నిలిచిపోతుందని.. ప్రశాంత్ నీల్ ఆ స్థాయిలో ఈ ఫైట్ ను కంపోజ్ చేశాడని తెలుస్తోంది. పైగా ఈ సిక్వెన్స్ కోసం హాలీవుడ్ నుండి స్టంట్ మాస్టర్ ని తీసుకువచ్చారట. అందుకే ఈ యాక్షన్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయని టాక్ నడుస్తోంది.

ఇక ఈ పాన్ ఇండియా సినిమా పై అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. కాగా ఆ అంచనాలను అందుకోవడానికి మేకర్స్ కూడా భారీగా కసరత్తులు చేస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. ఆమెది ట్రాజెడీ క్యారెక్టర్ అని.. ప్రభాస్ – శృతి హాసన్ మధ్య ట్రాక్ కూడా వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు