రవితేజ కెరీర్ లోనే ఆ సీన్ స్పెషల్ అట !

రవితేజ కెరీర్ లోనే ఆ సీన్ స్పెషల్ అట !

Published on Dec 19, 2022 1:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ అనే పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్ డేట్ వినిపిస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ లోనే రవితేజ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తోందని, ఈ ఎంట్రీ సీన్ సినిమా మొత్తంలోనే క్రేజీ సీన్ అని, అలాగే రవితేజ సినీ కెరీర్ లో కూడా ఈ సీన్ స్పెషల్ గా నిలుస్తోందని తెలుస్తోంది. ఈ సీన్ లో రవితేజ ఎనర్జిటిక్ ఫైట్స్ కి విజిల్స్ పడతాయట.

ఇక ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం దేవిశ్రీ ప్రసాద్ కొట్టిన ఆర్ఆర్ మైండ్ బ్లోయింగ్ అని తెలుస్తోంది. పైగా ఈ సీక్వెన్స్ లోనే రవితేజ పాత్ర – మెగాస్టార్ చిరంజీవి పాత్రలకు మధ్య సంఘర్షణను పెంచే విధంగా ఓ సంఘటన జరుగుతుందట. కాగా ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటించబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు