RRR టీమ్ కి మహేష్, చిరు, అల్లు అర్జున్ అభినందనలు

RRR టీమ్ కి మహేష్, చిరు, అల్లు అర్జున్ అభినందనలు

Published on Jan 11, 2023 7:04 PM IST

దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ ఇటీవల విడుదల తరువాత ఎంత పెద్ద సంచలన విజయం సొంతం చేసుకుందో మనకు అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటించిన ఈ మూవీ కి వందల కోట్ల కలెక్షన్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, భాషల ఆడియన్స్ అలానే సినీ ప్రముఖల ప్రసంశలు కూడా దక్కుతున్నాయి. అందులో భాగంగా పలు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ అవార్డులని సైతం అందుకుంటూ భారతీయ సినిమా ఖ్యాతిని మరింతగా తారా స్థాయికి తీసుకెళుతోంది RRR మూవీ. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు నేడు లభించడంతో సంగీత దర్శకుడు కీరవాణి ఆ అవార్డుని అందుకున్నారు.

ఈ అవార్డు తన సోదరుడు ఎస్ ఎస్ రాజమౌళికి దక్కుతుందని, ప్రతి సినిమాని అందరికీ చేరువ చేసేలా అతడి ఆలోచన ఎంతో గొప్పదని అన్నారు. ఇక RRR నాటు నాటు సాంగ్ కి ఏకంగా ఇంత పెద్ద ఇంటెర్నేషల్ అవార్డు దక్కడంతో దేశవ్యాప్తంగా అందరి నుండి విపరీతంగా అభినందనలు కురుస్తున్నాయి. కాగా కొద్దిసేపటి క్రితం టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలియచేసారు. RRR మూవీతో ప్రపంచ సినిమా ఇండియా వైపు చూస్తోందని, ముఖ్యంగా ఈ మూవీతో తెలుగు సినిమా హాలీవుడ్ స్థాయికి పెరిగిందని, ఈ మూవీని ఇంత గొప్పగా తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి, అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణితో పాటు హీరోలుగా నటించిన ఎన్టీఆర్, చరణ్ లు సహా టీమ్ మొత్తానికి వారు ప్రత్యేకంగా అభినందనలు తెలియచేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు