విజయ్ “లియో” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

విజయ్ “లియో” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Apr 2, 2023 3:00 PM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగ రాజ్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా “లియో” కోసం అందరికీ తెలిసిందే. మరి మేకర్స్ రీసెంట్ గానే కాశ్మీర్ లో ప్లాన్ చేసిన భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేయడంతో సినిమాలో చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యిపోయింది. ఇక సరికొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ కానుండగా మరి బ్యాలన్స్ షూట్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

ఈ సినిమాకి ఇంకా అయితే కేవలం రెండు నెలలు మాత్రమే షూట్ ఉందట. దీనిని కూడా అనుకున్న టైం లో కంప్లీట్ చేయాలని లోకేష్ ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి ఈ నెక్స్ట్ షూట్ చెన్నై మరియు హైదరాబాద్ లలో జరగనుంది. ఆల్రెడీ లోకేష్ షూటింగ్ ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరి “లియో” ని కూడా అలాగే కంప్లీట్ చేసి నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే స్టార్ట్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు