బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ్’. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, కన్నడ నటుడు యశ్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంగ్లీష్ డబ్బింగ్ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా ఈ ట్రైలర్‌లో ఉపయోగించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లిప్-సింక్ టెక్నాలజీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాధారణంగా భారతీయ సినిమాలను ఇంగ్లీష్‌లోకి డబ్బింగ్ చేసినప్పుడు నటుల పెదవుల కదలికలకు, సంభాషణలకు పొంతన ఉండదు. కానీ ‘రామాయణ్’ ఇంగ్లీష్ వర్షన్‌లో మాత్రం నటులు స్వయంగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడినట్లుగా AI లిప్-సింక్ చాలా సహజంగా కుదిరింది.
గ్లోబల్ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్
ఈ ఇంగ్లీష్ ప్రమోషనల్ కంటెంట్ చూసిన పలువురు నెటిజన్లు, ఒరిజినల్ వెర్షన్‌కు దీటుగా డబ్బింగ్ పర్ఫెక్ట్‌గా అనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. భారతీయ పౌరాణిక గాథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఈ తరహా సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సాంకేతికతను సరిగ్గా ఉపయోగిస్తే గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ సినిమాల ప్రాచుర్యం గణనీయంగా పెరుగుతుందని ఈ ట్రైలర్ నిరూపిస్తోందని సినీ అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


