ప్రత్యేక చిట్ చాట్ : సాయాజీ షిండే – సౌత్ ఇండియన్ టెక్నీషియన్స్ బాగా టాలెంటెడ్..
Published on Dec 5, 2013 9:00 pm IST

Sayaji-Shinde
‘పోకిరి’ సినిమాలో పూరి జగన్నాథ్ రాసిన ‘లారీ డీ ఇద్దరు ఠా’, ‘తిన్నామా పడుకున్నామా తెల్లారిందా’ అనే పంచ్ డైలాగ్స్ గుర్తున్నాయా.. ఈ పంచ్ డైలాగ్స్ ని పర్ఫెక్ట్ గా చెప్పి ప్రజల చేత చప్పట్లు కొట్టించుకున్న నటుడు సాయాజీ షిండే. బాలీవుడ్ కి చెందిన ఈ నటుడు 2003లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమా ద్వారా తెలుగు సినిమాకి పరిచయం అయ్యాడు. ఇప్పటి వరకూ తెలుగులో 100 సినిమాలకు పైగా నటించిన సాయాజీ షిండే, తన కెరీర్లో ఠాగూర్, పోకిరి, అరుంధతి, దేవదాసు, కిక్, అదుర్స్, దూకుడు లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు ‘1-నేనొక్కడినే’ సినిమాలో నటించాడు. ఈ సందర్భంగా మేము సాయాజీ షిండేతో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము. ఆయన మాతో ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు మీకోసం…

ప్రశ్న) ఇప్పటి వరకూ టాలీవుడ్ లో మీ జర్నీ ఎలా ఉంది?

స) టాలీవుడ్ కాదు ఇది టచ్ వుడ్, ఇక్కడ చాలా బాగుంది. తెలుగు సినిమాల్లో ఇంతకాలం నిలదొక్కుకుంటానని నేనెప్పుడు అనుకోలేదు. ఇక్కడ నాకోసం కొన్ని స్పెషల్ రోల్స్ రాస్తున్నారు. అలాగే ఇక్కడ అందరి పెద్ద డైరెక్టర్స్ సినిమాల్లో నాకు అవకాశాలు వస్తున్నాయి.

ప్రశ్న) మీ అన్ని సినిమాలకి మీరే డబ్బింగ్ చెప్పుకుంటారు. దాని వెనుక ఏమన్నా కారణం ఉందా?

స) అవును కారణం ఉంది. ఎప్పుడైతే నువ్వు చేసిన పాత్రకి నువ్వు డబ్బింగ్ చెబుతావో అప్పుడే ఆ పాత్ర చాలా బాగా వస్తుందని నేను ఫీలవుతాను. నేను సౌత్ లో వేరే భాషల్లో చేసే సినిమాలకు కూడా స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటాను.

ప్రశ్న) మీరు చేసిన పాత్రల్లో ఏ పాత్ర మీరు టాలీవుడ్ లో ఫిక్స్ అయ్యేలా చేసింది?

స) చెప్పాలంటే నేను కచ్చితంగా ఒక పాత్ర అని చెప్పలేను. ఇప్పటివరకూ ఎన్నో మంచి పాత్రలు చేసాను. సినిమాలంటే అన్నీ చెప్పలేను,, దేవదాసు, అరుంధతి, పోకిరి, ఆంధ్రుడు సినిమాల్లో చేసిన మంచి పాత్రలు నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.

ప్రశ్న) మీరు బాలీవుడ్ సినిమాల కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. హిందీ సినిమాల్లో నటించడాన్ని మిస్ అవుతున్నారా?

స) సౌత్ సినిమాలు నాకెప్పుడూ స్పెషల్. సౌత్ ఇండియన్ టెక్నీషియన్స్ టాలెంట్ మరియు వారికి పని పట్ల ఉన్న శ్రద్ధ చూసి ఆశర్యపోయాను. సౌత్ లోని అన్ని భాషల్లో చాలా కీలకమైన పాత్రలు చేస్తున్నాను. బాలీవుడ్ కంటే ఇక్కడ సినిమాలు చేయడమే చాలా ఆనందంగా ఉంది.

ప్రశ్న) బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేయడానికి ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారా?

స) ప్రస్తుతానికైతే ఎలాంటి ప్లాన్స్ లేవు. బాలీవుడ్ లో నాతో సినిమాలు చేయాలనుకునే వారు చాలా మంది నేను తెలుగు సినిమా యాక్టర్ ని అని అనుకుంటున్నారు. గతంలో బాలీవుడ్ నుంచి నాకు వచ్చిన ఆఫర్స్ నాకు బాగా నిరుత్సాహాన్ని కలిగించాయి. అలాగే కొంతమంది డైరెక్టర్స్ నన్ను ట్రీట్ చేసిన విశానం నాకు నచ్చలేదు.

ప్రశ్న) మీ రాబోయే తెలుగు సినిమాలు ఏమిటి?

స) నేను నటించిన సినిమాలు వరుసగా విడుదలకానున్నాయి. అందులో ముందుగా మహేష్ బాబు ‘1-నేనొక్కడినే’, సునీల్ ‘భీమవరం బుల్లోడు’ సినిమాలు విడుదలకానున్నాయి.

ప్రశ్న) మీరు చేయనున్న తదుపరి సినిమాలేమిటి?

స) నాకు మొదటి నుంచి కూడా మరాఠీ సినిమాలతో సంబంధం ఉంది. నా దగ్గర ఓ స్క్రిప్ట్ ఉంది. ఆ సినిమాని నేనే నిర్మాతగా నిర్మించాలనకుంటున్నాను.

అంతటితో తన రాబోయే సినిమాలు విజయం సాధించి మంచి పేరు తెచ్చిపెట్టాలని బెస్ట్ అఫ్ లక్ చెప్పి సాయాజీ షిండేతో మా చిత్ చాట్ ని ముగించాం..

రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook