షారుఖ్ కంటే నాకు ఎక్కువ ఆఫర్ చేశారు.. పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

షారుఖ్ కంటే నాకు ఎక్కువ ఆఫర్ చేశారు.. పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on May 5, 2024 4:02 PM IST


మన తెలుగు సినిమాలో భారీ స్టార్డం ఉన్న హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మరి పవన్ ఇపుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తుండగా వాటితో పాటుగా పాలిటిక్స్ లో కూడా బిజీగా ఉన్నారు. అయితే పవన్ మిగతా హీరోస్ తో పోలిస్తే ఏవైనా బ్రాండ్స్ కి అంబాసిడర్ లా చేస్తున్నది లేదు. అయితే ఒకప్పుడు సుమారు రెండు దశాబ్దాలు కితం అలా ఓ బ్రాండ్ కి మాత్రం చేసాడు. కానీ కొన్ని కారణాలు చేత అది కూడా వదిలేసాడు.

అయితే లేటెస్ట్ గా తాను చేసిన ఓ కామెంట్ ఇపుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న పవన్ తనకి అప్పుడు కోలా యాడ్ కి కంటిన్యూ చెయ్యమని బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ మొత్తంలో ఇస్తామని ఆఫర్ చేసేవారని కానీ నాకు అంత ఆసక్తి అనిపించలేదు అని కొన్ని విలువలు పెట్టుకొని దేని నుంచి డబ్బులు సంపాదించాలో దాని నుంచే సంపాదిద్దామని సినిమాలే చేసుకున్నాను అని పవన్ తెలిపాడు. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు