వరల్డ్ వైడ్ “ఆ ఒక్కటీ అడక్కు” 2 రోజుల వసూళ్లు.!

వరల్డ్ వైడ్ “ఆ ఒక్కటీ అడక్కు” 2 రోజుల వసూళ్లు.!

Published on May 5, 2024 1:54 PM IST


ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో అల్లరి నరేష్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా దర్శకుడు మల్లి అంకం తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “ఆ ఒక్కటీ అడక్కు” కూడా ఒకటి. మరి ఈ చిత్రం డీసెంట్ డే 1 స్టార్ట్ అయ్యి రెండో రోజుకి బాగా పికప్ అయ్యినట్టుగా మేకర్స్ తెలిపారు. ఇక ఇప్పుడు ఈ చిత్రం రెండు రోజుల్లో మంచి వసూళ్లే అందుకునట్టుగా తెలుస్తుంది.

వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 3.34 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. మరి ఈ వసూళ్లు మొదటి రోజు కంటే రెండో రోజు పెరిగినట్టుగా తెలుస్తుంది. మరి ఈ ఆదివారం కూడా బాగానే రావచ్చు. చూడాలి ఈ సినిమాతో మళ్ళీ అల్లరి నరేష్ ఫామ్ లోకి వచ్చినట్టో లేదో అని. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా వైవా హర్ష, వెన్నెల కిషోర్, జామీ లివర్, అరియానా గ్లోరీ తదితరులు నటించారు. అలాగే రాజీవ్ చిలక ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు