కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ చిత్రం “టాక్సిక్” కోసం అందరికీ తెలిసిందే. మరి పాన్ ఇండియా హిట్ చిత్రాలు కేజీయఫ్ రెండిటి తర్వాత వస్తున్నా సినిమా ఇది కావడంతో ఈ చిత్రం పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంని గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తుండగా దీనిని కూడా పాన్ ఇండియా లెవెల్లో అనౌన్స్ చేశారు.
అయితే ఈ సినిమా సంబంధించి ఏదొక అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా లేటెస్ట్ గా యష్ పోస్ట్ చేసిన స్టోరీ ఇప్పుడు హైలైట్ గా మారింది. సోషల్ మీడియాలో నేను ఎక్కువ పోస్ట్ లు చెయ్యాలా వద్దా అంటూ పోల్ చేయగా దానికి చెయ్యాలి అనే ఎక్కువ ఓట్స్ వచ్చాయి. అయితే ఇది టాక్సిక్ సినిమా సంబంధించి అప్డేట్ తన నుంచే రానుంది అని అనుకుంటున్నారు. మరి వేచి చూడాలి తను ఎలాంటి అప్డేట్ అందిస్తాడో అనేది.