“వార్ 2” నుంచి మరో ఇంట్రెస్టింగ్ లీక్.!

“వార్ 2” నుంచి మరో ఇంట్రెస్టింగ్ లీక్.!

Published on Apr 28, 2024 10:06 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హైప్ లో ఉన్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం “వార్ 2” అని చెప్పాలి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా షూట్ లో తారక్ అలాగే హృతిక్ లు కూడా ఇటీవల జాయిన్ కాగా అప్పుడే పలు లీక్స్ కూడా బయటకి వచ్చేసాయి. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ లీక్ బయటకి వచ్చింది. ఈసారి హృతిక్ రోషన్ సరికొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపడుతున్నారు.

తన “సూపర్ 30” నాటి లుక్ లో హృతిక్ ఇప్పుడు కనిపిస్తుండగా ప్రస్తుతం వార్ 2 లో డాన్స్ నెంబర్ కోసం తాను ఈ మేకోవర్ లోకి మారి ఉండొచ్చు అని కొని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ సినిమా నార్త్ టు సౌత్ ఏ రేంజ్ ట్రీట్ ని అందిస్తుంది అనేది. మరి యష్ రాజ్ ఫిల్మ్స్ వారు ఈ చిత్రాన్ని తమ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిస్తుండగా వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే రేస్ లో రిలీజ్ చేయబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు