తెలుగులో ఒకేరోజు 12 సినిమాలు విడుదల !

ప్రతి శుక్రవారం మూడో, నాలుగో సినిమాలు విడుదల అవ్వడం చూసాం కాని ఈ నెల 15 న ఒకేసారి 12 సినిమాలు విడుదల కానున్నాయి. జూలియట్ లవర్ అఫ్ ఇడియట్, కుటుంభ కథ చిత్రం, లచ్చి, ఇది మా ప్రేమకథ, సీతా రాముని కోసం, మరో దృశ్యం, ప్రేమ పందెం, మామ చందమామ, ఉందా లేదా, తోలి పరిచయం, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, పడిపోయా నీ మాయలో.

డిసెంబర్ 15 తరువాత 21 న నాని ఎం.సి.ఎ 22 న అఖిల్ హలో విడుదల కానున్నాయి. ఒక వారం గ్యాప్ లో ఈ సినిమాలు తన సత్తా చాటాలి. సినిమా బాగుంటే తరువాత వారం కొనసాగుతుంది. ఏది ఏమైనా ఏడాది చివర్లో ఇన్ని చిన్న సినిమాలు విడుదల అవ్వడం విశేషం.