చెన్నై లో బాహుబలి 2 రికార్డు ను క్రాస్ చేయనున్న 2.0 !

Published on Dec 10, 2018 12:04 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ , అక్షయ్ కుమార్ , శంకర్ ల కలయికలో తెరకెక్కిన 2.0 ఇటీవల విడుదలై బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. ముఖ్యంగా ఈ చిత్రం చెన్నై లో ఆల్ టైం రికార్డు ను క్రియేట్ చేయనుంది. అక్కడ 11రోజులకుగాను ఈ చిత్రం 18.41 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ‘బాహుబలి 2’ (18.50 కోట్లు ) కలెక్షన్స్ ను నేటి తో క్రాస్ చేయనుంది.

ఇక ఈ చిత్రం కేరళలో కూడా 20 కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టి అక్కడ బాహుబలి 2 తరువాత అత్యధిక వసూళ్లను రాబట్టిన డబ్బింగ్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఏఆర్ రహెమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం :