‘రోబో 2’కి కూడా లీక్ బెడద తప్పలేదా?
Published on Oct 3, 2016 1:11 pm IST

robot
సూపర్ స్టార్ రజనీ కాంత్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ప్రభంజనం ‘రోబో’కి సీక్వెల్‌గా ప్రస్తుతం ‘రోబో 2’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోందన్న ప్రచారం పొందుతోన్న ఈ సినిమాకు శంకర్ ‘2.0’ అన్న టైటిల్‌ను తెలుగు, తమిళం, హిందీ మూడు భాషలకూ ఫిక్స్ చేశారు. ఇక ఈ టైటిల్‌కు శంకర్ టీమ్ ఎంతగానో కష్టపడి ఒక లోగోను కూడా సిద్ధం చేసేసిందట. త్వరలోనే ఆ లోగోను టీమ్ విడుదల చేయాలని భావిస్తుండగా, ఇప్పటికే అది లీక్ అయిందని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో లీక్ అయిన లోగో సందడి చేసేస్తోంది. అయితే ఇది అభిమానులు తయారుచేసిన లోగో అన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం చెన్నై పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఓ కొత్త అనుభూతినిస్తుందని తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 

వీక్షకులు మెచ్చిన వార్తలు