‘2.0’ నైజాం కలక్షన్స్ !

Published on Dec 6, 2018 8:54 am IST

2.0 నవంబర్ 29న విడుదలై బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబడుతూ 500కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ చిత్రం తెలుగు రాష్టాల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతుంది. నైజాం లో ఈచిత్రం వారం రోజుల్లో 17కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమాకు ఆక్కడ ఈ రేంజ్ లో వసూళ్ళు రాబట్టడం ఇదే మొదటిసారి.

ఇక శంకర్ , రజినీ , అక్షయ్ కుమార్ ల కలయికలో తెరకెక్కిన ఈ చిత్రం అటు హిందీ లో నిన్న ఒక్క రోజు 10 కోట్ల షేర్ ను రాబట్టి డ్రీం రన్ ను కొనసాగిస్తుంది. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :