షూటింగ్ ముగించేసుకున్న భారీ బడ్జెట్ చిత్రం !


శంకర్, రజనీకాంత్ ల కలయికలో రూపొందుతున్న ‘రోబో-2’ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శంకర్ తన విజన్ కు తగ్గట్టే భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్ర బడ్జెట్ ఇప్పటికే సుమారు రూ.380 కోట్లు దాటేసి విడుదల నాటికి రూ. 450 కోట్లు తాకుంతుందని అంచనా. ఈ ఒక్క పాట మినహా మిగత షూట్ మొత్తం చాల రోజుల క్రితమే పూర్తికాగా ఇప్పుడు ఆ పాట కూడా పూర్తయినట్టు తెలుస్తోంది.

దీంతో చిత్రీకరణ మొత్తం పూర్తైపోయిందట. ఇక ప్రస్తుతం నడుస్తున్న విఎఫ్ఎక్స్ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి. ఇకపోతే ఈ నెల 27న ఈ చిత్ర ఆడియో వేడుక దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందు కోసం ప్రత్యేకంగా చాటెడ్ ఫ్లైట్స్ ను కూడా ఏర్పాటు చేశారు నిర్మాతలు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా విడుదల కూడా కళ్ళు చెదిరే స్థాయిలో ఉండనుంది.