రిలీజ్ డేట్ ఖాయం చేసుకున్న రజనీ ‘2.0’ !
Published on Oct 29, 2017 7:33 pm IST

ముందుగా తెలిపినట్టు రజనీ, శంకర్ ల ‘2పాయింట్0’ చిత్ర్రం జనవరి నెలలో రిలీజ్ కావడంలేదు. తాజాగా తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 13న రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. విఎఫ్ఎక్స్ పనులు ఇంకా మిగిలి ఉండటం, జనవరిలో అక్షయ్ కుమార్ యొక్క ‘ప్యాడ్ మాన్’ విడుదలకానుండటమే ఇందుకు కారణమట.

సుమారు రూ. 430 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం తాజాగా దుబాయ్ లో భారీ ఎత్తున ఆడియో విడుదల కార్యక్రమాన్ని జరుపుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలతో పాటు ఇంకా పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానున్న ఈ చిత్ర్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆస్కార్ విజేత ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

 
Like us on Facebook