పేరెంట్స్ పై హీరోయిన్ క్రేజీ కామెంట్స్

పేరెంట్స్ పై హీరోయిన్ క్రేజీ కామెంట్స్

Published on Apr 28, 2024 5:06 PM IST

టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన పేరెంట్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ, మృణాల్ ఠాకూర్ ఏం చెప్పింది అంటే.. ముద్దు సీన్స్‌ ఉన్న సినిమాల్లో తాను నటించేందుకు తన తల్లిదండ్రులు అంగీకరించేవారు కాదని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. ఆ కారణంగా తాను చాలా అవకాశాల్ని కోల్పోయానని మృణాల్ ఠాకూర్ చెప్పింది.

మృణాల్ ఠాకూర్ ఇంకా మాట్లాడుతూ… ‘ఒక నటిగా అక్కడ సన్నివేశం, కథ తాలూకు అవసరాన్ని చూడాలి. ఒకవేళ ముద్దు సన్నివేశం ఉందని సినిమాలు వదులుకుంటూ వెళ్తే ఇక సినిమాలు చేయలేం. ఇదే విషయాన్ని మా పేరెంట్స్‌‌కు అర్థమయ్యేలా చెప్పాను. మొదట్లో వారు అర్థం చేసుకోలేదు. కానీ, ఇప్పుడు వారికి అర్ధం అయ్యింది’ అంటూ మృణాల్ ఠాకూర్ చెప్పింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు