“విశ్వంభర” కోసం ఇన్ని గ్రాండ్ సెట్టింగ్స్..

“విశ్వంభర” కోసం ఇన్ని గ్రాండ్ సెట్టింగ్స్..

Published on Apr 28, 2024 4:07 PM IST

తెలుగు సినిమా లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ మళ్ళీ వింటేజ్ బాస్ ట్రీట్ ఇచ్చే విధంగా ఓ భారీ ఫాంటసీ థ్రిల్లర్ గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.

అయితే ఇది వరకే ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్స్ ని మేకర్స్ వేసినట్టుగా పలు వార్తలు ఉన్నాయి. మరి తాజాగా దీనిపై మరింత క్లారిటీ వినిపిస్తుంది. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఏకంగా మొత్తం 17 గ్రాండ్ సెట్టింగులు వేసారట. వీటిలోని దాదాపు సినిమా పూర్తవుతుందని తెలుస్తుంది.

ఇప్పటికే షూటింగ్ చాలా మేర కంప్లీట్ కాగా మిగతా మొత్తం కూడా ఈ జూలై నాటికి పూర్తవుతుంది అని సమాచారం. అక్కడ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మెయిన్ గా వి ఎఫ్ ఎక్స్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమాని నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు