రాధే శ్యామ్ లవ్ అంతెం కి 50 మిలియన్ వ్యూస్!

Published on Dec 6, 2021 7:44 pm IST


పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్ విడుదల కి సిద్ధం గా ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ను షురూ చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలు, విడియోలు, ప్రచార చిత్రాలు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి.

ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుండి లవ్ అంతెం ను చిత్ర యూనిట్ అన్ని బాషల్లో విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఆ లవ్ అంతెం కి యూ ట్యూబ్ లో 50 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :