నవంబర్ మీద ఆధారపడి ఉన్న ఆరుగురు హీరోల జాతకాలు !
Published on Oct 24, 2017 5:42 pm IST


రాబోయే నవంబర్ నెల 6 మంది హీరోలకు పరీక్షగా నిలవనుంది. ఎన్నాళ్ళ నుండో హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరోలంతా నవంబర్ నెలలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఆరుగురిలో సీనియర్ హీరో దగగర్నుంచి యంగ్ హీరోల వరకు ఉన్నారు. ఇంతకీ ఆ ఆరుగురు ఎవరంటారా… వాళ్లే డా. రాజశేఖర్, మంచుమనోజ్, ఆది సాయికుమార్, గోపీచంద్, సిద్ధార్థ్, సందీప్ కిషన్.

ఈ ఆరుగురు హీరోలకు ప్రస్తుతం హిట్ అత్యవసరం. అందుకే రాజశేఖర్ నవంబర్ 3న ‘గరుడవేగ’ చిత్రంతో వస్తుంటే అదే రోజున సిద్దార్థ్ కూడా హర్రర్ థ్రిల్లర్ ‘గృహం’ తో వస్తున్నాడు. అలాగే ఆది సాయికుమార్ కూడా 3న రిలీజ్ కానున్న ‘నెక్స్ట్ మువ్వే’ తో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇక మంచు హీరో మనోజ్ అయితే నవంబర్ 10న రిలీజ్ కానున్న ‘ఒక్కడు మిగిలాడు’ మీదే బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంతో ఎలాగైనా ట్రాక్లో పడాలని ట్రై చేస్తున్నాడాయన.

ఇక చివరగా చేసిన నక్షత్ర్రం కలిసిరాకపోవడంతో సందీప్ కిషన్ ద్విభాషా చిత్రం ‘కేరాఫ్ సూర్య’ ను నమ్ముకోగా, గోపీచంద్ కూడా గత చిత్రం ‘గౌతమ్ నంద’ తో నిరాశపడి నవంబర్ 10న రానున్న ‘ఆక్సిజన్’ తో అయినా ఊపిరి పీల్చుకోవాలనుకుంటున్నాడు. ఈ ఆరుగురు హీరోల సినిమాలకు ప్రస్తుతం పాజిటివ్ క్రేజ్ ఉంది కాబట్టి విడుదలయ్యాక మంచి ఫలితాలు రావాలని ఆశిద్దాం.

 
Like us on Facebook