బాలయ్య వచ్చే వరకు యంగ్ హీరో కుమ్ముకోవచ్చు.

Published on Nov 11, 2019 4:48 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ లేటెస్ట్ మూవీ 90ఎంఎల్. మోడ్రన్ దేవదాసులా కనిపిస్తున్న కార్తికేయ ఈ చిత్రంతో మంచి విజయం అందుకోనున్నారని టాక్. ఆర్ఎక్స్100 మూవీతో సాలిడ్ హిట్ అందుకున్న ఈ హీరో మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఆర్ఎక్స్100 నిర్మాతలు తెరకెక్కిస్తున్న 90ఎంఎల్ పై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. కొత్త దర్శకుడు యెర్రా శేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మూవీని కార్తికేయ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్నారు.

ఐతే 90ఎంఎల్ మూవీ వచ్చే నెల 5న విడుదల చేస్తున్నారు. నిన్న ఈ మేరకు రిలీజ్ పోస్టర్స్ విడుదల చేశారు. కాగా డిసెంబర్ 5న చెప్పుకోదగ్గ చిత్రాలేమి విడుదల కావడం లేదు. ఒకవేళ కొన్ని చిత్రాలు విడుదలైనా, అవి చిన్న చిత్రాలు కావచ్చు. కొంచెం పేరున్న హీరోల చిత్రాలన్ని వచ్చే వారం విడుదల అవుతుండగా, బాలయ్య రూలర్, ధరమ్ తేజ్ ప్రతిరోజు పండుగే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రానున్నాయి. కాబట్టి డిసెంబర్ 5ముందు గాని, తరువాత గాని పెద్ద చిత్రాల విడుదల లేకపోవడంతో దాదాపు రెండు వారాలు వసూళ్లు కుమ్ముకునే అవకాశం కలదు. 90ఎంఎల్ కి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్ల వరదే.

సంబంధిత సమాచారం :

More