‘అ..ఆ..’ త్రివిక్రమ్ బెస్ట్ : సమంత
Published on Mar 12, 2016 9:19 am IST

AA
దర్శకుడు త్రివిక్రమ్-సమంతల కాంబినేషన్‌లో ఇప్పటికే ‘అత్తారింటికి దారేదీ’, ‘S/O సత్యమూర్తి’ లాంటి సూపర్ హిట్ సినిమాలు రాగా, తాజాగా ఈ ఇద్దరూ ‘అ..ఆ..’ అనే సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్ధమైపోయారు. వరుస రొమాంటిక్ హిట్స్‌తో తెలుగులో జోరు మీదున్న నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘అ..ఆ..’ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ను నిన్న సమంత తన ట్విట్టర్ ఎకౌంట్‍ ద్వారా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో త్రివిక్రమ్ మార్క్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫీల్ స్పష్టంగా కనుపడుతూ అభిమానులను పోస్టర్ విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఇక ఈ ప్రీ లుక్ విడుదల చేస్తూ సమంత ‘అ..ఆ..’ సినిమా ఎలా ఉండబోతోందో రెండు మాటల్లో పరిచయం చేశారు. “‘అ..ఆ..’ సినిమా చూశాక అందరూ హాయిగా చిన్న స్మైల్‌తో బయటకొస్తారు. త్రివిక్రమ్ బెస్ట్ వర్క్ ఇది” అన్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేర్చిన టీమ్ మే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనుంది. ఇక త్వరలోనే ఫస్ట్‌లుక్, టీజర్‌లతో పాటు ఇంటరెస్టింగ్ అప్‌డేట్స్‌తో సిద్ధమవుతోన్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. మిక్కీ జే. మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook