సామ్ “సిటాడెల్” ఇండియన్ వెర్షన్ కి సరికొత్త టైటిల్.!

సామ్ “సిటాడెల్” ఇండియన్ వెర్షన్ కి సరికొత్త టైటిల్.!

Published on Mar 19, 2024 8:00 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇపుడు చిన్న బ్రేక్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాను ఈ బ్రేక్ తీసుకోకముందే కంప్లీట్ చేసిన మరో అవైటెడ్ వెబ్ సిరీస్ “సిటాడెల్” కూడా ఒకటి. మరి సమంత సెన్సేషనల్ హిట్ ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకే లు తెరకెక్కించిన ఈ సిరీస్ హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కి రీమేక్ గా తెరకెక్కించారు. మరి ఎన్నో నెలలు గడిచినప్పటికీ సిరీస్ పై ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించలేదు.

మరి ఫైనల్ గా ఈ సిరీస్ పై ఇప్పుడు ప్రైమ్ వీడియో వారు ఓ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు గ్రాండ్ గా ప్లాన్ చేసిన ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ ఈవెంట్ లో ఇండియన్ వెర్షన్ సిటాడెల్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ని అనౌన్స్ చేశారు. దీనితో ఇండియా వెర్షన్ కి “సిటాడెల్ : హనీ బన్నీ” అనే టైటిల్ సహా ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. అయితే ఈ సిరీస్ రిలీజ్ డేట్ ఇంకా రివీల్ కావాల్సి ఉంది. ఇక ఈ స్పై థ్రిల్లర్ లో సమంతతో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు