కన్ఫర్మ్..”RRR” టోటల్ రన్ టైం పై ఓ క్లారిటీ.!

Published on Dec 9, 2021 7:06 am IST

ఇండియన్ సినిమా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ “రౌద్రం రణం రుధిరం”. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు మాస్ హీరోలతో చేసిన భారీ చిత్రం ఇది. ఇక ఇప్పుడు రిలీజ్ కి రెడి అవుతున్న ఈ సినిమా నుంచి నేడు మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రిలీజ్ అవుతుండగా దీనితో పాటు ఈ భారీ సినిమా టోటల్ రన్ టైం కూడా బయటకు వచ్చింది.

మరి మొదటి నుంచి వినిపించినట్టు గానే ఈ చిత్రం 3 గంటలకు పైనే ఉన్నట్టుగా సెన్సార్ ద్వారా తెలిసింది. ఈ చిత్రం మొత్తం 3 గంటల 6 నిమిషాల 54 సెకండ్లు వచ్చిందట. అలాగే సెన్సార్ వారు ఈ చిత్రంకి యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు రానున్న ట్రైలర్ కూడా మూడు నిమిషాలు పైనే లాక్ చెయ్యబడింది. మరి మూడు నిమిషాల వచ్చే నెలలో మూడు గంటలకు పైన సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయో రాజమౌళి చూపించిన విజువల్స్ ఎమోషన్స్ ఎంతవరకు నిలబెడతాయో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :