“అఖండ” పై క్రేజీ అనౌన్స్మెంట్ కి రంగం సిద్ధం.!

Published on Oct 5, 2021 10:01 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “అఖండ” కోసం అందరికీ తెలిసిందే. బాలయ్య ఆస్థాన దర్శకుల్లో ఒకరిగా మారిన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో తెరకెక్కిస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎప్పుడు నుంచో మంచి సస్పెన్స్ నెలకొని ఉంది.

ఫైనల్ గా అయితే దీపావళి కానుకగా ఈ చిత్రం రిలీజ్ అవుతుంది అని సినీ వర్గాల్లో టాక్ మొదలు కాగా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ దీనిపై వినిపిస్తుంది. ఈ వచ్చే 6వ తారీఖు తర్వాత ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్రేజీ అనౌన్స్మెంట్ రాబోతుందట. ఇక దీని కోసమే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అది ఏ సమయంలో అయినా రావొచ్చు గెట్ రెడీ. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :