యూనివర్సల్ హీరో హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తో చేస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి దీనిపై భారీ అంచనాలు నెలకొనగా తెలుగులో “భారతీయుడు 2” గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారా అనే సమయంలో జూన్ రిలీజ్ అంటూ మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. కానీ లేటెస్ట్ గా ట్విస్ట్ తో ఈ సినిమా జూన్ నుంచి జూలై కి షిఫ్ట్ అయ్యినట్టుగా రూమర్స్ మొదలయ్యాయి.
అయితే ఇప్పుడు జూలై లో రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది వినిపిస్తుంది. జూలై లో ఈ సినిమా 11 లేదా 17న రిలీజ్ కి వస్తున్నట్టుగా టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి అయితే ఇప్పుడు ఇండియన్ 2 విషయంలో మళ్లీ మొత్తం మొదటికే వచ్చినట్టుగా చెప్పాలి. మరి ఇదంతా ఎప్పుడు క్లియర్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.