చరణ్ – లోకేష్ కనగ్ రాజ్ ప్రాజెక్ట్ పై కన్ఫర్మ్ అయ్యిన న్యూస్.?

Published on Jul 20, 2022 7:01 am IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ సినిమాని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరి కెరీర్ లో కూడా 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా నెక్స్ట్ చరణ్ చేయబోయే లైనప్ పై కూడా ఎప్పటికప్పుడు మాంచి ఆసక్తి రేగుతుండగా దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తో చేసే ప్రాజెక్ట్ పై కూడా అందరిలో మంచి ఎగ్జైట్మెంట్ నెలకొంది.

దీనితో ఈ క్రేజీ కాంబో అయితే ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కాంబోలో సినిమా ఆల్రెడీ ఉందని కన్ఫర్మ్ కాగా ఇప్పుడు ఇంకా ఓ డీటెయిల్ దీనిపై అన్నట్టు వినిపిస్తోంది. దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ మన తెలుగు నుంచి ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ తో ఓ సినిమా కమిట్ అయ్యినట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ కూడా రామ్ చరణ్ తోనే అయ్యేందుకు అధిక ఛాన్స్ లు ఉన్నాయని చెప్పాలి. మరి ఈ సెన్సేషనల్ ట్రయో కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :