
మణిరత్నం కాంబినేషన్ అనగానే రెహమాన్ తనలో బెస్ట్ అవుట్ పుట్ ఇస్తాడన్న విషయం పలుమార్లు రుజువుచేసాడు. నిన్న రాత్రి విడుదలైన ‘ఒకే బంగారం’ సినిమా పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తుంది.
ఇంతకుమించిన విషయం ఏమిటంటే ఈ సినిమాలో ఒక అరబిక్ పాటని రెహమాన్ తనయుడు అమీన్ ఆలపించాడు. ఈ పాట విన్నవారంతా ఈ చిచ్చరపిడుగుకి మంచి టాలెంట్ వుందని ప్రశంసిస్తున్నారు. రెహమాన్ సంగీతం, అమీన్ గాత్రం కలిసి రాత్రికిరాత్రి సూపర్ హిట్ గా మార్చేశాయి.

