‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ లో చరణ్ మళ్ళీ గాయపడ్డారా …?

Published on Jul 23, 2019 6:52 pm IST

“ఆర్ ఆర్ ఆర్” మూవీ అభిమానులకు ఇది చేదు వార్తే అని చెప్పాలి. అదేమిటంటే “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ లో చరణ్ మళ్ళీ గాయపడ్డారని తెలుస్తుంది. ఓ జాతీయ మీడియా కధనం ప్రకారం చరణ్ కి మరోమారు గాయమైందని, ఐతే అది పెద్ద గాయమేమి కాదని, ఆ మీడియా ప్రచురించడం జరిగింది. అమెరికా నుండి తిరిగివచ్చిన రాజమౌళి,ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రదేశాలలో షూటింగ్ కి ప్రణాళికలు వేయడం జరిగింది. నిజానికి ఈ షెడ్యూల్ ఎప్పుడో కంప్లీట్ కావాల్సివుండగా చరణ్ కి మేజర్ గాయం కావడంతో ఆ షెడ్యూల్ అప్పుడు వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ చరణ్ గాయం అయిందా లేదా అనే విషయం పై స్పష్టత రావాల్సివుంది.

ఇప్పటికే ఎన్టీఆర్,చరణ్ లకు జరిగిన వరుస గాయాలతో షూటింగ్ షెడ్యూల్ ఆలస్యంగా జరుగుతున్న తరుణంలో మళ్ళీ ఎలాంటి న్యూస్ అభిమానులను కంగారుపెడుతుంది. అలాగే ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా హాలీవుడ్ కి చెందిన అమెరికన్ నటి ఎమ్మా రాబర్ట్స్ నటించనుందని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :