“రాధే శ్యామ్” నుంచి ఏ సమయంలో అయినా స్పెషల్ ట్రీట్.!

Published on Mar 15, 2022 12:00 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ కోసం అందరికీ తెలిసిందే. అనేక అంచనాలు నడుమ వచ్చిన ఈ ప్రేమకథా చిత్ర ప్రేమికులని అయితే ఆకట్టుకుంది. మరి ఈ భారీ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన వాటిలో సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒకటి చెప్పాలి.

అయితే ఇపుడు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పైనే దర్శకుడు రాధాకృష్ణ ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు. ఈరోజే ఏ సమయంలో అయినా స్పెషల్ ట్రీట్ ని రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసాడు. దీనితో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. మరి ఇదెప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో తెలుగులో మరియు సౌత్ ఆల్బమ్ కి జస్టిన్ ప్రభాకరన్ వర్క్ చెయ్యగా హిందీలో మిథున్ మరియు మనన్ భరద్వాజ్ లు అందించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :