ప్రతి తల్లిని భావోద్వేగానికి గురిచేస్తోన్న ఎన్టీఆర్ ‘పెనివిటి’ పాట !

Published on Sep 20, 2018 12:57 pm IST

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్రం నుండి విడుదలైన ‘పెనివిటి’ లిరికల్ వీడియో సాంగ్ తారక్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులను కూడా ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది. అందరికి విపరీతంగా నచ్చుతుంది. కాగా తాజాగా ‘పెనివిటి’ పాట విని ఓ తల్లి చాలా భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె ఎవరో కాదు ఈ పాట సృష్టికర్త అయిన సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌ తమన్‌ తల్లి కావడం విశేషం.

తమన్ తన ట్వీటర్ ద్వారా తెలుపుతూ.. ‘పెనివిటి’ పాట విన్న వెంటనే మా అమ్మ నన్ను పిలిచింది. నేను వెళ్లగానే నన్ను పట్టుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. నా చొక్కా మా అమ్మ కన్నీళ్లతో తడిచిపోయింది. ఈ సాంగ్ వినగానే ఓ అమ్మ కలిగిన నిజమైన భావం ఇది. ఈ ప్రపంచంలో అమ్మకు మించింది ఏదీ లేదు’ అని పోస్ట్ చేస్తూ… తన తల్లితో దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు.

ఇక ఈ ‘పెనివిటి’ సాంగ్, ఓ ఇల్లాలు తన భర్త కోసం ఎదురుచూస్తూ.. మనసులో తన భర్తని ఉద్దేశించి పాడుకున్న ఓ కన్నీటి భావేద్వేగమైన పాట. ఈ పాట ఈ చిత్ర కథనంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చిత్రబృందం చెబుతుంది. ఈ పాటను ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రిగారు రాశారు. ఈ చిత్రాన్ని హారిక-హాసిని క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. దసరా సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం :