ప్రముఖ నిర్మాతతో మూడు సినిమాలకు సైన్ చేసిన ఆది !
Published on Nov 1, 2017 1:04 pm IST

రెగ్యులర్ మాస్ కథల్ని పక్కనబెట్టి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్ని ఎంచుకుంటూ ముందుకెళుతున్న యంగ్ హీరో ఆది సాయికుమార్ చేసిన కొత్త చిత్రం ‘నెక్స్ట్ నువ్వే’ ఈ నవంబర్ 3న ప్రేక్షకుల మునుకురానుంది. హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం తప్పక తనకు విజయాన్ని తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఉన్న ఆది తన తర్వాతి సినిమాల్ని ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో చేయనున్నారు.

అది కూడా ఏకంగా మూడు సినిమాల్ని సైన్ చేయడం విశేషం. ఈ మూడింటిలో రెండు ద్విభాషా చిత్రాలుగా ఉండనున్నాయి. వీటిలో ‘యామిరుక్క భయమే’ దర్శకుడు డీకే డైరెక్షన్లో ఉండగా విజయ్ అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా ఉండనుంది. ఈ రెండూ కాకుండా ఒక స్ట్రయిట్ తెలుగు సినిమాను కూడా చేయనున్నాడు ఆది. ఈ మూడు ప్రాజెక్ట్స్ కూడా తనకు మంచి సక్సెస్ ను ఇస్తాయని, కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళతాయనే నమ్మకంతో ఉన్నారు ఆది.

 
Like us on Facebook