ఈ ఏడాది ఆరంభంలోనే మన తెలుగు సినిమా నుంచి భారీ హిట్స్ వచ్చాయి. యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) నటించిన సెన్సేషనల్ సూపర్ హీరో చిత్రం “హను మాన్” (Hanu Man Movie) పాన్ ఇండియా వైడ్ భారీ హిట్ అయితే మన సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన “గుంటూరు కారం” రీజనల్ లెక్కలు తేల్చింది. అయితే ఈ రెండు సినిమాలు తర్వాత మళ్ళీ ఆ రేంజ్ భారీ సినిమాలు అయితే పెద్దగా రాలేదు.
ఇక ఇప్పుడు ఈ ఛాన్స్ ని పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న అవైటెడ్ పాన్ వరల్డ్ చిత్రం “కల్కి 2898 ఎడి” తీసుకోబోతుంది అని చెప్పాలి. అయితే దీనికి ముందే “ఇండియన్ 2” సినిమా రావాల్సి ఉంది కానీ ఇది వాయిదా పడుతుండడంతో మన సౌత్ నుంచి సహా తెలుగులో కూడా నెక్స్ట్ బిగ్గెస్ట్ రిలీజ్ కల్కి కే దక్కింది అని చెప్పవచ్చు. మరి ఇప్పటికే ఓ భారీ సినిమా లేని లోటు ఇండస్ట్రీలో కనిపిస్తుంది. కల్కి నాటికి హైప్, బాక్సాఫీస్ వాతావరణం ఎలా ఉంటాయో చూడాలి.