టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన “ఆదికేశవ”

టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన “ఆదికేశవ”

Published on Jan 31, 2024 11:31 AM IST


టాలీవుడ్ మెగా హీరో, పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఆదికేశవ. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. డిజిటల్ ప్రీమియర్ గా నెట్ ఫ్లిక్స్ లోకి ఈ సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

వచ్చే ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ఈ సినిమా ప్రసారం కానుంది. యంగ్ బ్యూటీ శ్రీ లీల లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించడం జరిగింది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు