డబుల్ మెగా ట్రీట్ ఇచ్చిన “ఆచార్య” టీం.!

Published on Mar 27, 2021 10:00 am IST

మొదటగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు.. మరి తన పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు తాను చేస్తున్న భారీ చిత్రాల నుంచి సాలిడ్ అప్డేట్స్ కూడా వచ్చాయి. నిన్ననే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ రౌద్రం రణం రుధిరం నుంచి అల్లూరిగా ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చెయ్యగా దానికి భారీ స్థాయి రెస్పాన్స్ వచ్చింది.

మరి దీనితో పాటుగా తాను చేస్తున్న మరో మెగా మల్టీ స్టారర్ “ఆచార్య” నుంచి కూడా ఒక మాస్ పోస్టర్ ను విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు. ఫైనల్ గా మేకర్స్ చెప్పిన టైం కి ఈ పోస్టర్ ను ఊహించనిదే వదిలారని చెప్పాలి. మొదటగా కేవలం చరణ్ ఒక్కడు ఉండే పోస్టర్ నే విడుదల చేస్తారు అనుకుంటే ఇందులో ది బిగ్ బాస్ మెగా స్టార్ట్ చిరంజీవిని కూడా చూపించారు.

నక్సల్ గెటప్స్ లో తుపాకులు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారు. చిరు వెనుక చరణ్ కనిపిస్తూ అదనపు బలంగా కనిపిస్తున్నాడు. మొత్తానికి మాత్రం ఇది డబుల్ మెగా ట్రీట్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :