అజిత్, వలిమై చిత్రం గురించి కార్తికేయ కీలక వ్యాఖ్యలు!

Published on Jan 2, 2022 3:30 pm IST

అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినొత్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం వలిమై. బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి మరియు జీ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని బోని కపూర్ నిర్మించడం జరిగింది. అజిత్ కుమార్ నటిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుని ఈ సంక్రాంతి 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది.

ఈ చిత్రం లో టాలీవుడ్ హీరో గుమ్మకొండ కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నారు. విలన్ పాత్రలో కార్తికేయ సూపర్ గా కనిపిస్తున్నారు. ట్రైలర్ లో కార్తికేయ లుక్స్ మరియు స్టంట్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం పై, హీరో అజిత్ కుమార్ పై కార్తికేయ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అల్టిమేట్ స్టార్ ను ఎదుర్కొనేందుకు స్ట్రాంగ్ గా ఉండాలి అని, కొత్త సంవత్సరం ను వలిమై తో ప్రారంభించడం కి మించిన సంతోషం ఇంకేం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక ఒక ఫోటో ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. అందులో కార్తికేయ చాలా స్ట్రాంగ్ గా, దృఢం గా కండల తో కనిపిస్తున్నారు. హుమా ఖురేషీ కీలక పాత్ర లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :