మైండ్ బ్లోయింగ్…పుష్ప మాస్ సాంగ్ పై రష్మిక రెస్పాన్స్!

Published on Nov 19, 2021 5:06 pm IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కి సిద్దం అవుతోంది. ఈ చిత్రం కి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియా తో కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు సినిమా ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం నుండి తాజాగా ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ లిరికల్ వీడియో విడుదల అయ్యింది. ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతేకాక యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ ను కొల్లగొడుతోంది. అయితే ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న రష్మీక మందన్న ఈ పాటకు సంబందించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఈ పాట కి సంబంధించిన రఫ్ ఎడిట్ ను నేను చూసా, మైండ్ బ్లోయింగ్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ స్టార్ చేసే ప్రతి ఒక్కటి కూడా అమేజింగ్ గా ఉంటుంది. ఈ పాట థియేటర్ల లో చూసేటప్పుడు మైండ్ పోతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇది జస్ట్ టీజర్ అంటూ పాట పై మరింత ఆసక్తి పెంచేశారు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ఫాహద్ ఫజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సమంత ఒక స్పెషల్ సాంగ్ లో ఆడి పాడనుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More