అందుకే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి…అలీ చిత్రం పై సమంత కామెంట్స్!

Published on Jul 23, 2021 7:21 pm IST


అలీ, నరేష్, పవిత్రా లోకేష్ ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం అందరూ బావుండాలి అందులో నేనుండాలి. అయితే మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన వికృతి చిత్రానికి ఇది రీమేక్. ఆలివుడ్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై అలీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ కొణతాల, బాబా అలీ, శ్రీ చరణ్ లు సంయుక్తంగా నిర్మించారు. అయితే శ్రీ పురం కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఎ. ఆర్ రెహమాన్ వద్ద సంగీత శిక్షణ పొందిన రాకేష్ పళిదం చిత్రానికి సంగీతం అందించారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలు ఇప్పటికే విడుదల అయ్యాయి. మొదటి పాట ప్రభాస్, రెండవ పాట సోనూ సూద్ విడుదల చేయగా, మూడవ పాటను సమంత అక్కినేని తాజాగా విడుదల చేశారు.అయితే ఈ పాటను విడుదల చేసిన అనంతరం సమంత పలు కీలక వ్యాఖ్యలు చేశారు.అందరూ బావుండాలి అందులో నేనుండాలి సినిమా లో మూడవ పాటను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఎందుకంటే నా ఫేవరేట్ అలీ గారు ప్రొడక్షన్ చేస్తున్న మొదటి చిత్రమిది అని అన్నారు. అంతేకాక తనకి ఇలాంటి రియల్ లైఫ్ కథలంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి సోల్ ఉన్న కథలను చూస్తూ ఉంటా అని, ఇట్స్ ఏ స్లైన్ ఆఫ్ లైఫ్, ఎందుకంటే రియలిస్టిక్ అండ్ రిలేటబుల్ స్టొరీ అని అన్నారు.సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అని, అలీ గారి మీద నమ్మకం ఉందని తెలిపారు.

అయితే నటుడు అలీ మాట్లాడుతూ, సమంత నేను అడగ్గానే నా సినిమాలో మూడో పాటను విడుదల చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు. తాను నటిస్తున్న శాకుంతలం చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అలీ అన్నారు.

సంబంధిత సమాచారం :