అదిరింది విడుదల వాయిదాకు కారణాలు ఇవే !
Published on Oct 26, 2017 6:20 pm IST

విజయ్ హీరోగా నటించిన తమిళ్ మూవీ ‘మెర్సల్’ కలెక్షన్ల పరంగానే కాదు, కాంట్రవర్సీల పరంగానూ హై స్పీడ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమాలో జీఎస్టీ, నోట్ల రద్దు వంటి వాటిని విమర్శించిన తీరు ఓ వర్గానికి ఆగ్రహం తెప్పించింది. ఆ వర్గం సృష్టించిన అలజడి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇలా ఎదో రకంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తు ఉంది ఈ సినిమా, తమిళ్ లో విడుదలై మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా తెలుగులో విడుదల అవ్వడం లేదు.

ఈ సినిమాలో కేంద్ర ప్రబుత్వానికి వ్యతిరేకంగా డైలాగ్స్ ఉన్నాయని, వాటిని తొలగిస్తే సినిమాను విడుదల చేస్తామని సెన్సార్ సభ్యులు చెప్పడం, అందుకు చిత్ర యూనిట్ వ్యతిరేకించడం తో సినిమా విడుదల ఆలస్యం అవుతుంది. రేపు (శుక్రవారం) విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు, థియేటర్స్ ఆన్లైన్ బుకింగ్ స్టార్ట్ చేసారు, కాని సినిమా వాయిదా పడింది, త్వరలో మరో విడుదల డేట్ ను అనౌన్సు చెయ్యనున్నారు చిత్ర నిర్మాత.

 
Like us on Facebook