వరల్డ్ వైడ్ 2 రోజుల్లో “ఆదిపురుష్” భారీ వసూళ్లు.!

వరల్డ్ వైడ్ 2 రోజుల్లో “ఆదిపురుష్” భారీ వసూళ్లు.!

Published on Jun 18, 2023 2:32 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ నటి కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “ఆదిపురుష్” కోసం తెలిసిందే. మరి ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ ఓపెనర్ గా అయితే ఈ చిత్రం ఇప్పుడు నిలవగా మొదటి రోజే వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 140 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టగా ఇక రెండో రోజు కూడా వరల్డ్ వైడ్ 100 కోట్లకి పైగా వసూళ్లు కొల్లగొట్టింది.

ఈ చిత్రం అయితే ఏకంగా రెండు రోజుల్లో 240 కోట్ల మార్క్ ని టచ్ చేసి బాక్సాఫీస్ దగ్గర ఊహించని రీతిలో విజృంభిస్తుంది. ఇక ఈ ఆదివారం కూడా సెన్సేషనల్ నంబర్స్ ని ఆదిపురుష్ నమోదు చేసే ఛాన్స్ గట్టిగానే ఉందని చెప్పాలి. మరి వారాంతంలో అయితే ఇండియన్ సినిమా దగ్గర ఆదిపురుష్ కొత్త రికార్డు ఏమన్నా సెట్ చేస్తుందేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి అజయ్ అతుల్ లు సంగీతం అందించగా ఓంరౌత్ భూషణ్ కుమార్ లు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు