ఫుల్ యాక్షన్ తో “ఆదిపురుష్” రెండో ట్రైలర్.?

Published on Jun 4, 2023 9:00 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సహా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో చేసిన మాసివ్ విజువల్ ట్రీట్ చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. ఇక ఈ జూన్ లో జస్ట్ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ భారీ ఈవెంట్ లోనే ఆదిపురుష్ రెండో ట్రైలర్ ని అయితే లాంచ్ చేయనున్నారు అనే టాక్ కూడా వైరల్ గా మారింది.

మరి ఈ ట్రైలర్ అయితే ఈసారి నెక్స్ట్ లెవెల్ యాక్షన్ మోడ్ లో ఉంటుంది అని తెలుస్తుంది. అంతే కాకుండా ఈ ట్రైలర్ రెండు నిమిషాల 30 సెకండ్స్ లోపు ఉండగా ఫస్ట్ ట్రైలర్ కన్నా ఎన్నో రెట్లు హైప్ ఇచ్చేలా అయితే ఈ ట్రైలర్ ఉంటుంది అని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ సెకండ్ ట్రైలర్ విషయంలో ఫ్యాన్స్ అధికారిక క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ అవైటెడ్ సినిమా జూన్ 16 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :