అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న ‘గూఢచారి’ !
Published on Feb 19, 2018 5:59 pm IST

ఇటీవలే ‘క్షణం’ సినిమాతో విజయాన్ని అందుకున్న యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం ‘గూఢాచారి’ అనే సినిమా చేస్తున్నాడు. శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర షూటింగ్ కొంత భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది.

ఈ షూట్ కోసం అడివి శేష్ తన టీమ్ తో కలిసి యూఎస్ బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే ఈ సినిమా అస్సామ్, మేఘాలయ, ఢిల్లీ, బంగ్లాదేశ్ వంటి ప్రాంతాల్లో షూట్ జరుపుకుంది. ఈ లొకేషన్స్ చూస్తే స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం విజువల్స్ పరంగా మంచి స్థాయిలోనే ఉండబోతోందని తెలుస్తోంది. అక్కినేని సుప్రియ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook