ఆ సినిమాలన్నీ విడుదల అయ్యేది అప్పుడేనా!?

Published on Jul 20, 2021 11:11 pm IST

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మళ్ళీ తెరుచుకుంటున్నాయి. అయితే కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా మూత బడిన థియేటర్లు ఇప్పుడు తెరుచుకోవడం తో ప్రేక్షకులు పూర్తి స్థాయిలో థియేటర్ల కి వస్తారా లేదా అనే ఒక అనుమానం ఉంది. అంతేకాక పూర్తి స్థాయి లో సిట్టింగ్ కెపాసిటీ తో తెరుచుకోవడం కూడా కాస్త కష్టమే అని చెప్పాలి. అంతేకాక టికెట్ల ధరల విషయం కూడా ఆందోళన కలిగిస్తోంది అని చెప్పాలి.

అయితే సినిమా థియేటర్లు ప్రారంభం అయినప్పటికీ టికెట్ల ధరల స్థిరీకరణ మరియు పూర్తి సిట్టింగ్ కెపాసిటీ తో తెరుచుకున్న తర్వాతే సినిమాలకు లాభం చేకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బడ్జెట్ ఎక్కువగా ఉన్న సినిమాలు, స్టార్ హీరో సినిమాలు, మీడియం సినిమాల విడుదల లు కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :