‘జైలర్ 2’ట్రైలర్: 1000 కోట్లు మార్క్ ప్రశ్నార్ధకమేనా?

‘జైలర్ 2’ట్రైలర్: 1000 కోట్లు మార్క్ ప్రశ్నార్ధకమేనా?

Published on Oct 6, 2026 2:00 PM IST

ఇండియన్ సినిమా మార్కెట్ దగ్గర ఒకప్పుడు ఓ సినిమా 100 కోట్ల మార్క్ అందుకోవడం ఎంతో గొప్ప అలాంటిది హిందీ మార్కెట్, తమిళ్ మార్కెట్ లు 2010 లలోనే 300 కోట్ల వరకు వెళ్లిపోయాయి. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. కొలమానం 1000 కోట్ల మార్క్ కి చేరుకుంది. దీనికి ఆద్యం పోసింది మాత్రం మన తెలుగు సినిమానే. దాదాపు ప్రతి ఇండస్ట్రీ నుంచి 1000 కోట్ల గ్రాస్ ఉన్న సినిమాలు ఉన్నాయి.

కానీ ఎన్నో ఏళ్ళు నుంచి తమిళ్ ఇండస్ట్రీకి ఈ మార్క్ ఒక అందని ద్రాక్ష గానే మిగిలింది. అయితే ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ మార్క్ ని సాధించేది తలైవర్ రజినీకాంత్ జైలర్ 2 నే అని చాలామంది బలంగా నమ్మారు. ముఖ్యంగా పార్ట్ 1 ఒక్కటే 600 కోట్లకి పైగా గ్రాస్ అందుకోవడంతో కేవలం ఈ సీక్వెల్ మాత్రమే 1000 కోట్ల వసూళ్లు ఇచ్చే సినిమాగా నిలిచే అవకాశం ఉందని చాలామంది నమ్మారు.

కానీ ఒక్కసారి ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ రేంజ్ పోటెన్షియల్ ఈ సినిమాలో లేదు అనే అనిపిస్తుంది. ఒక బ్లాస్ట్ లాంటిది అంతా ఆశిస్తే నెల్సన్ యావరేజ్ కట్ వదిలారు. దీనితో ఈ సినిమాతో అయినా 1000 కోట్ల గ్రాస్ తమిళ్ ఇండస్ట్రీ అందుకుంటుంది అనే ఆశ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది. మరి విడుదల నాటికి, విడుదల అయ్యాక మరిన్ని సర్ప్రైజ్ లతో జైలర్ 2 అనుకున్నది సాధిస్తుందా లేదా అనేది చూడాలి.

తాజా వార్తలు