‘రణబాలి’ నాన్ స్టాప్ ప్రమోషన్స్.. టార్గెట్ పాన్ ఇండియా లాక్!

‘రణబాలి’ నాన్ స్టాప్ ప్రమోషన్స్.. టార్గెట్ పాన్ ఇండియా లాక్!

Published on Oct 6, 2026 3:00 PM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన అవైటెడ్ హిస్టారికల్ సినిమా రణబాలి కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు ఉన్న ఈ హిస్టారికల్ ప్రాజెక్ట్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాని మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక అందుకు తగ్గట్టుగా రిలీజ్ రోజు ముందు వరకు నాన్ స్టాప్ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. అక్టోబర్ 8 ట్రైలర్ లాంచ్ నుంచి విడుదల తేది ముందు రోజు 15 వరకు పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేయనున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ హిందీ ఇలా అన్ని చోట్లా రణబాలి టేకోవర్ చేయనుంది. సో పాన్ ఇండియా వైడ్ గా మంచి వసూళ్ల కోసం టార్గెట్ లాక్ చేసుకున్నారని చెప్పొచ్చు. విజయ్ కి రష్మికకి తెలుగు మినహా పాన్ ఇండియా మార్కెట్ లో మంచి ఆదరణ ఉంది. సో రణబాలి ఏ మేరకు పాన్ ఇండియా మార్కెట్ లో వర్క్ అవుతుందో చూడాలి.

తాజా వార్తలు