త్రివిక్రమ్ – మెగాస్టార్ కాంబినేషన్ ఉంటుందట ?

Published on Apr 4, 2020 2:00 am IST

మెగా ఫ్యాన్స్ ఊహల్లోని డ్రీమ్ కాంబినేషన్లలో త్రివిక్రమ్ – మెగాస్టార్ కాంబినేషన్ ఒకటి. పైగా ఈ కాంబినేషన్ ఎంతో క్రేజ్ తో కూడుకున్నది. ఎప్పటికైనా త్రివిక్రమ్ తో మెగాస్టార్ సినిమా చేస్తే చూడాలనేది మెగా ఫ్యాన్స్ కోరిక. అయితే భవిష్యత్తులో ఆ కోరిక తీరేలానే ఉంది. మెగాస్టార్ కి త్రివిక్రమ్ గతంలో ఒక ఇంట్రస్టింగ్ లైన్ చెప్పాడని, ఆ లైన్ మీద త్రివిక్రమ్ ఆల్ రెడీ కొంత వర్క్ చేశాడని.. రానున్న రెండు సంవత్సరాలలో ఈ కాంబినేషన్ లో ఓ సినిమా రానుందనే వార్త, ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కాగా వీరిద్దరూ కలిసి చేసే సినిమా ప్యూర్ కమర్షియల్ ఎంటెర్టైనర్ అట.

ఎలాగూ త్రివిక్రమ్ సినిమా అంటే.. ఎమోషన్ అండ్ యాక్షన్ తో పాటు హీరో ఖచ్చితంగా కామెడీ చేయాల్సిందే. ఇక హాస్యాన్ని పండించడంలో మెగాస్టార్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో ఎంటెర్టైనర్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడానికే థ్రిల్ గా అనిపిస్తోంది. ఇకపోతే చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More